Friday, July 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దు.!

అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దు.!

- Advertisement -

నవతెలంగాణ-కథనానికి స్పందన
నవతెలంగాణ-మల్హర్ రావు : అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు మోసపోవద్దని మండల కేంద్రమైన తాడిచెర్ల పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి సూచించారు.శుక్రవారం నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో ప్రచురించిన ప్లాట్లుగా మారుతున్న పంట పొలాలు అనే కథనానికి కార్యదర్శి స్పందించారు.తన బృందంతో వెళ్లి తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కాపురం రెవెన్యూ శివారులో అక్రమంగా వెలిసిన వెంచర్లో బోర్డ్స్ సిబ్బందితో తొలగించారు.ఈ సందర్భంగా మాట్లాడారు అక్రమ వెంచర్లలో ప్రజలు ఎవరు కూడా ప్లాట్స్ కొని మోసపోరాదన్నారు.ప్లాట్స్ కొనే ముందు గ్రామపంచాయతీనీ సందర్శించి పర్మిషన్ ఉన్న వాటిలో మాత్రమే ప్లాట్స్ కొనుగోలు చేయాలని తెలిపారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు కూడా అనుమతి లేకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేయరాదని,అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -