– ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ బృందం మెరుపు దాడి
నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ నగర నడిబొడ్డున కొంతకాలంగా సాగుతున్న ఎండు గంజాయి విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కు పాదం మోపారు. పక్కా సమాచారంతో రెండు వేరు వేరు ప్రాంతాలలో మెరుపు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశం శుక్రవారం తెలిపారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేశo ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులలో 200 గ్రాముల ఎండు గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఎ. వెంకటేష్ తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ అరుణ్ కుమార్ ఆదేశాల ప్రకారం గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం, ముందస్తు సమాచారం మేరకు నగరంలోని పులాంగ్ చౌరస్తా, బోధన్ బస్టాండ్ ఏరియాలో దాడులు నిర్వహించి, ఎండుగంజాయి అమ్ముతున్న షేక్ సమీర్,మహ్మద్ రిజ్వాన్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్దనుండి రెండు వందల గ్రాముల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ తనిఖీలలో ఎస్ఐ రామ్ కుమార్, సిబ్బంది భూమన్న, విఠల్,లక్ష్మీ నర్సయ్య, శివకుమార్, సాయి కుమార్, శ్యామ్ సుందర్, ప్రకాశ్ లు తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడి..గంజాయితోపాటు ఇద్దరి అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



