Friday, July 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభం..

గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : పట్టణంలో నూతన గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. భీంగల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ బోడిరె నాగమణి స్వామి, తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్పర్సన్ మానాల మోహన్ రెడ్డి సంయుక్తంగా ఈ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ శ్రీమతి బోడిరె నాగమణి స్వామి మాట్లాడుతూ… 2000 సంవత్సరంలో యూనిట్ బ్యాంక్‌గా ప్రారంభమైన గాయత్రి బ్యాంక్, వినియోగదారులకు పారదర్శక, సత్వర సేవలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. నేడు మల్టీస్టేట్ బ్యాంక్‌గా ఎదిగి రూ. 4557.34 కోట్ల వ్యాపారాన్ని సాధించిందని, 9 లక్షల 35 వేల వినియోగదారులతో తెలంగాణలోనే కో-ఆపరేటివ్ బ్యాంకులలో మొదటి స్థానానికి చేరుకోవడం గర్వకారణమని ఆమె అన్నారు. రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్పర్సన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… భీంగల్ లో ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఇది స్థానికుల ఆర్థిక అవసరాలను తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గాయత్రి కోపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో ప్రారంభించి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రారంభించిన శాఖ 85వ దని తెలంగాణ, ఆంధ్రా లో 4,500 కోట్ల టర్నోవర్తో కొనసాగుతున్న ఈ బ్యాంక్, మరింత ఆర్థిక పరిపుష్టి సాధించి ముందుకు వెళ్లాలని రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బ్యాంక్ అందిస్తున్న ప్రత్యేక సేవల గురించి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సంటి లత నర్సయ్య మాట్లాడుతూ, నిరక్షరాస్యులకు సహాయకరంగా ఉండేందుకు బ్యాంకులో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారని, అలాగే టెక్నలాజికల్ పేమెంట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ నాగేంద్ర బాబు మాట్లాడుతూ… ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు బ్యాంక్ సేవలు అందుబాటులో ఉంటాయని, ఖాతాదారులకు అవసరమైన ఫోటో, జిరాక్స్‌లను బ్యాంకులోనే ఉచితంగా అందించడం వంటి వినూత్న సేవలను ప్రశంసించారు.

​ఖాతాదారులకు ప్రత్యేక సౌకర్యాలు:

​ప్రమాద భీమా: గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా ద్వారా రూ. 2 లక్షల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు.ఎటువంటి హిడెన్ చార్జీలు లేకుండా, కేవలం రూ. 1000/- బ్యాలెన్స్‌తో కరెంట్ ఖాతాను ప్రారంభించవచ్చని పర్ష అనంత రావు పేర్కొన్నారు. ఆధార్ నెంబర్ ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చే సబ్సిడీలను, ప్రభుత్వ పెన్షన్లను ఈ బ్యాంక్ ద్వారా పొందవచ్చని, అలాగే బంగారు ఆభరణాలపై రుణాలు కూడా అందజేస్తామని బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ ఆర్.కె.వి. అరుణ్ కుమార్ వివరించారు.రైతులు, వ్యాపారులకు ఆస్తి తనాఖాపై రుణ సౌకర్యం కల్పిస్తామని, సేవింగ్, కరెంట్ ఖాతాలను వెంటనే ప్రారంభిస్తామని బ్రాంచ్ హెడ్ శ్రీ జక్కు సుమన్ తెలిపారు. రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేవని, డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

​భీంగల్ పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు, రైతులు ఈ బ్యాంక్ సేవలను వినియోగించుకొని ఆదరించాలని బ్యాంక్ యాజమాన్యం మరియు ప్రజాప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సంటి లత నర్సయ్య, 1వ వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ నాగేంద్ర బాబు, ఐ.ఎన్.సి. మండల ప్రెసిడెంట్ మల్లెల లక్ష్మణ్, ఐ.ఎన్.సి. టౌన్ ప్రెసిడెంట్ పర్స అనంత రావు, బ్యాంక్ పాలక వర్గ సభ్యులు, సహకార అధికారులు, పురప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -