Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅరుణోదయ నాగన్న కన్నుమూత

అరుణోదయ నాగన్న కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు అరుణోదయ నాగన్న (65) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రాజారం గ్రామానికి చెందిన నాగన్న తన పాటలతో విప్లవ భావాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఎన్నో ప్రజా పోరాటాలకు, ఉద్యమాలకు ఆయన పాటలు ఊపిరి పోశాయి. నాగన్న మృతిపట్ల పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -