Friday, August 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత

మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత

- Advertisement -

సీజేపీ ఉద్యమమే నిదర్శనం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- వనపర్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను దేశ ప్రజలు తిప్పికొడుతు న్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో గురువారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాదం ఓ వైపు ఇజ్రాయిల్‌తో కలిసి పాలస్తీనాపై యుద్ధం కొనసాగిస్తూ.. మరోవైపు క్యూబా దేశం మీద ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని చెప్పారు. అమెరికా దిగుమతి చేసుకునే చైనా వస్తువులపై వంద శాతం సుంకాలు విధిస్తామని బెదిరింపులు చేసిందన్నారు. కానీ చైనా వెనక్కి తగ్గకపోవడంతో ఏమీ చేయలేకపోయిం దన్నారు. దేశంలో మోడీ, అమిత్‌షాకు ఎదురు లేదని ప్రచారం జరుగుతున్న సమయంలో పెద్దఎత్తున దేశ యువత సీజేపీ రూపంలో పోరాటం నిర్వహించి విజయం సాధించారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేవరకు పోరాటం కొనసాగడం మార్పుకు నిదర్శనమన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే పరిస్థితి ప్రజల్లో వచ్చిందన్నారు. పోరాటంలో పాల్గొన్న యువతను దేశ ద్రోహులు అని ప్రకటించిన కేంద్రానికి.. వాళ్లు దేశ ద్రోహులు కారని చివరికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రకటించాల్సి వచ్చిందని
గుర్తు చేశారు.

మళ్లీ డీలిమిటేషన్‌, మహిళా బిల్లును పార్లమెంట్‌లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఆ బిల్లులను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకుండా దేశ సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెడుతోందని విమర్శించారు. బొగ్గు గనులు, బ్యాంకులు, రైల్వేలు, ఎల్‌ఐసీ, రక్షణ రంగం మొదలగు ప్రభుత్వ రంగాలను తమ తాబేదారులకు కట్టబెట్టడమే దేశభక్తినా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని జాన్‌వెస్లీ ఆరోపించారు. నేటికీ సంపూర్ణంగా రైతులకు రైతుబధు వేయలేదన్నారు. రోజు రోజుకూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన పోరాటాలు పెద్దఎత్తున చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డి. జబ్బార్‌, డి.బాల్‌రెడ్డి, మండ్ల రాజు, లక్ష్మి, గోపి, జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వరచారి, మేకల ఆంజనేయులు, ఆర్‌ఎన్‌. రమేష్‌, మండ్ల కృష్ణయ్య, ఎస్‌.రాజు, బి.వెంకటేష్‌, బాల్య నాయక్‌, మహబూబ్‌ పాషా, వెంకటయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -