Friday, July 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఎమ్మెల్యే చొరవతో బైపాస్ రోడ్లకు మహార్దశ

ఎమ్మెల్యే చొరవతో బైపాస్ రోడ్లకు మహార్దశ

- Advertisement -

– ప్రయాణికులకు తప్పనున్న ఇక్కట్లు
నవతెలంగాణ -ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో గల బైపాస్ రోడ్లకు సిసి రోడ్లు నిర్మాణాలకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించడంతో సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. ఈ బైపాస్ రోడ్ల  అభివృద్ధితో ముధోల్  నుంచి జాతీయ రహదారికి వెళ్లడానికి మరింత రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది.  వివరాల్లోకి వెళితే..ముధోల్ గల మూడు బైపాస్ రోడ్లు అద్వాన స్థితికి చేరుకొని గుంతల మయంగా మారాయి. దీంతో ప్రతిసారి తాత్కాలిక మరమత్తులతో  సంబంధిత అధికారులు సరిపెట్టేవారు. అయితే ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్  మూడు బైపాస్ రోడ్లకు నిధులు మంజూరు చేయించటంతో  బైపాస్ రోడ్లకు మహార్దశ కలిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ముధోల్ లో ని  పెట్రోల్ బంక్ బైపాస్ రోడ్డుకు  సిసి రోడ్డు నిర్మాణం కు 55 లక్షలు, సాయిమాధవ్ నగర్ బైపాస్ కు  సీసీ రోడ్డు , మురికి కాల్వ నిర్మాణం కోసం 50 లక్షలు, కోలిగల్లీ  హనుమాన్ టెంపుల్ నుండి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు కు   సిసి రోడ్డు నిర్మాణానికి కోటి రూపాయలు  ఎమ్మెల్యే మంజూరు చేయించారు. దీంతో  పెట్రోల్ బంక్ బైపాస్ సిసి  రోడ్డు పనులు ముగింపుకు  చేరుకున్నాయి. సాయి మాధవ్ నగర్ బైపాస్ రోడ్ల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. కొలిగల్లీ బైపాస్ రోడ్డు పనులు కూడా ప్రారంభం కానున్నాయి. దశాబ్దాలుగా ముధోల్  బైపాస్ రోడ్లు అస్తవ్యస్తంగా, గుంతల మయంగా ఉండేవి. ఆ రోడ్డు కుండా వెళ్లేవారు తరుచూ ప్రమాదాలకు గురయ్యేవారు.  బైపాస్ రోడ్డుల అభివృద్ధికి  నిధులు మంజూరు చేయాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిధులు మంజూరు అయ్యయి.బైపాస్ రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే చర్యలు తీసుకోవటం తో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -