నవతెలంగాణ-నెల్లికుదురు : నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్‌గా కె. వీరస్వామి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పిండిప్రోలులో ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా విధులు నిర్వహించానాని అన్నాడు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు కళాశాల అభివృద్ధికి కృషి చేసిన అనుభవం ఉంది అని ఈ సందర్భంగా ఆయన తెలిపాడు. , కళాశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపక బృందంతో సమన్వయంగా పనిచేయడం, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొక్కుల సదానందం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పెండిప్రోలు ప్రిన్సిపాల్ రామకృష్ణ, వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు గణేష్, నయీమ్ పాషా. కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.



