బీజింగ్ : ఆర్థిక, వాణిజ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ చైనా, యూరప్‌లు ఉన్నత స్థాయి సమావేశాలు, సంప్రదింపులను ముమ్మరం చేశాయి. విభేదాల పరిష్కారానికి ఇరు పక్షాలు సుముఖంగా ఉన్నాయని చెప్పడానికి ఇది సంకేతం. డెన్మార్క్ రాజు ఫ్రెడరిక్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శుక్రవారం భేటీ అయ్యారు. వివిధ రంగాలలో డెన్మార్క్‌తో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, ఇరు దేశాల ప్రజల మధ్య మార్పిడులను ప్రోత్సహించడానికి చైనా సిద్ధంగా ఉన్నదని తెలిపారు. డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లొక్కే రాస్ముసేన్‌తో కూడా వాంగ్ యీ సమావేశమయ్యారు.
ఇటీవలి కాలంలో చైనా, యూరప్ మధ్య సంప్రదింపులు బాగా పెరిగాయి. అందులో భాగంగానే డెన్మార్క్‌లో వాంగ్ యీ పర్యటించారు. లండన్‌లో రెండు రోజుల క్రితం జరిగిన చైనా-బ్రిటన్ సంయుక్త ఆర్థిక-వాణిజ్య కమిషన్ పదిహేనవ సమావేశానికి చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో, బ్రిటన్ వాణిజ్య-వ్యాపార వ్యవహారాల కార్యదర్శి పీటర్ కైల్ అధ్యక్షత వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ-బహు పాక్షిక సహకారంపై ఇరు పక్షాలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి.
బలపడుతున్న చైనా-యూరప్ సంబంధాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



