Sunday, July 5, 2026
E-PAPER
Homeఆటలుఇంగ్లాండ్‌తో అరంగేట్రం..వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం

ఇంగ్లాండ్‌తో అరంగేట్రం..వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో అరంగేట్రం చేసిన వైభవ్.. 37 ఏళ్లుగా సచిన్‌ తెందుల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. శనివారం ఇంగ్లాండ్‌తో రెండో టీ20 ఆడేటప్పటికి వైభవ్‌ వయసు 15 ఏళ్ల 99 రోజులు మాత్రమే. 1989లో సచిన్‌ 16 ఏళ్ల 205 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ (పాకిస్థాన్‌తో టెస్టు) ఆడి రికార్డు నెలకొల్పాడు.

వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్రం మ్యాచ్ అనంతరం తొలిసారి సోషల్ మీడియాలో స్పందించాడు. ‘‘మీ అందరి నుంచి వస్తున్న సందేశాలు చూసి నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా సీనియర్లకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే  అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతిసారీ నా జట్టు కోసం నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. అందరికీ ధన్యవాదాలు’’ అని వైభవ్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -