Sunday, July 5, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య విరాళాల చోరీ..మోడీపై ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు

అయోధ్య విరాళాల చోరీ..మోడీపై ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అయోధ్య అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. కాశీ, మథుర కడతాం అని కొందరు చెబుతున్నారు. కానీ అయోధ్యలోనే ఇంత పెద్ద ఎత్తున విరాళాల దోపిడీ జరిగితే.. రేపు కాశీ, మథురలో జరిగే దోపిడీ గురించి నాకు భయమేస్తోంది’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. హిందువులను దోచుకునేవారే ఇప్పుడు అధికారంలో ఉండటం దురదృష్టకరమన్నారు. ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన ‘రామరక్ష’ ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమకు బీజేపీ మార్కు హిందుత్వం కాకుండా, స్వచ్ఛమైన హిందుత్వం కావాలని పిలుపునిచ్చారు. రామాలయంలో విరాళాలు దొంగిలించిన వారికి శ్రీరాముడి పేరెత్తే అర్హతే లేదని దుయ్యబట్టారు. హిందువులు వెర్రివాళ్లు కాదని, రాముడి సొమ్మును లూటీ చేసిన వారిని క్షమించరని స్పష్టం చేశారు. భగవాన్ శ్రీరాముడిని కాపాడుకోవడానికి హిందువులంతా కలిసి రావాలని ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -