Sunday, August 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅర్హులైన వారికి 48 గంటల్లోనే రేషన్ కార్డు: మంత్రి పొన్నం ప్రభాకర్

అర్హులైన వారికి 48 గంటల్లోనే రేషన్ కార్డు: మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అర్హులైన వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 48 గంటల్లోనే కార్డు జారీ చేసే విధంగా వ్యవస్థను సిద్ధం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, పారదర్శకంగా మరియు వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నాంపల్లి, చాంద్రాయణగుట్ట ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన చెప్పారు. “ఈ రోజు దరఖాస్తు చేస్తే రెండు రోజుల్లోనే రేషన్ కార్డు చేతికి అందేలా చర్యలు తీసుకుంటాం. దీనిపై ఎలాంటి సందేహం అవసరం లేదు” అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -