Sunday, August 16, 2026
E-PAPER
Homeజాతీయంగురువుకు పెద్ద పరీక్షే!

గురువుకు పెద్ద పరీక్షే!

- Advertisement -

పాఠాలు చెప్పడం కంటే తల్లిదండ్రుల ఒత్తిడే ఎక్కువ
క్రమశిక్షణ పాటింపజేస్తే ఫిర్యాదుల భయం…
అనేక బాధ్యతలను ఒకేసారి నిర్వహించాల్సిన పరిస్థితులు
మరోపక్క యాజమాన్యాల శ్రమ దోపిడీ
మౌనంగానే అనుభవిస్తున్న ఉపాధ్యాయులు
సోషల్ మీడియా, కరోనా ప్రభావంతో తరగతి గదుల్లో పూర్తిగా మారిన వాతావరణం

ఒకప్పుడు తరగతి గదిలోకి గురువు అడుగుపెడితే విద్యార్థులంతా లేచి నిలబడి ‘గుడ్ మార్నింగ్ టీచర్’ అని పలకరించే రోజులు ఉండేవి. గురువు చెప్పిందే శాసనం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లల ప్రవర్తన, తల్లిదండ్రుల అంచనాలు, సోషల్ మీడియా ప్రభావం, నిరంతర పర్యవేక్షణ, అడ్మినిస్ట్రేషన్‌ పనులు, మానసిక ఆరోగ్య సమస్యలు… ఇవన్నీ కలిసి ఉపాధ్యాయ వృత్తిని గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు క్లిష్టంగా మార్చేశాయి. పాఠాలు చెప్పడమే కాదు.. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కూడా గురువులపై పడుతోంది. దీంతో వారు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని మౌనమే సమాధానంగా గడుపుతున్నారు.

న్యూఢిల్లీ : ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే జ్ఞానాన్ని అందించే వ్యక్తి మాత్రమే కాదు.. క్రమశిక్షణకు ప్రతీక కూడా. తరగతిలో విద్యార్థులు అల్లరి చేస్తే వారిని బయట నిలబెట్టడం, మందలించడం, అవసరమైతే చిన్నపాటి శిక్ష విధించడం వంటివి ఉండేవి. వీటిని తల్లిదండ్రులు సైతం అంత సీరియస్‌‌గా తీసుకునేవారు కాదు. గురువుల నిర్ణయాలను ప్రశ్నించకుండా గౌరవించేవారు కూడా. కానీ నేటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు విద్యార్థిని గట్టిగా మందలించడానికే వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు చెప్తున్నదేమిటంటే.. ఇప్పుడు పాఠాలు చెప్పడం కంటే ‌యాజమాన్యం, తల్లిదండ్రుల వాట్సాప్‌ సందేశాలకు సమాధానాలు ఇవ్వడం, వారి ఫోన్లు ఎత్తడం, ఈ-మెయిళ్లకు స్పందించడం, వివిధ రకాల రికార్డులు నిర్వహించడం, విద్యార్థుల ప్రవర్తనపై రిపోర్టులు తయారు చేయడంలోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.

​గురువు పాత్ర పూర్తిగా మారింది
ఇప్పటి ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు మాత్రమే కాదు… విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకునే కౌన్సిలర్‌గా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే నిపుణుడిగా, పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగిగా, కొన్నిసార్లు అత్యవసర వైద్య సహాయం అందించే వ్యక్తిగానూ వ్యవహరించాల్సి వస్తోంది. కొన్ని పాఠశాలలు ఉపాధ్యాయులకు సీపీఆర్, ఆందోళన లక్షణాలను గుర్తించడం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నాయి.

క్రమశిక్షణ పాటింపజేయడమే సవాలు
నోయిడాలోని ఓ పాఠశాల హిందీ విభాగాధిపతి చారు చెప్తున్న సంఘటన నేటి పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఇద్దరు విద్యార్థులు గొడవపడుతుండగా వారిని ఆపేందుకు ఓ ఉపాధ్యాయుడు స్వల్పంగా తాకగానే… ‘‘నన్ను తాకే

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -