సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు శంకర్
నవతెలంగాణ – మిడ్జిల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభను విజయవంతం చేసిన మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి స్వగృహంలో నూతన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహ్మద్ గౌస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటయ్య, సాయిలు, మల్లికార్జున రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మిడ్జిల్ నుండి జడ్పిటిసిగా ఎన్నికై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభను విజయవంతం అయిందటే మండల కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రమ ఉందని వారు చెప్పారు. మిడ్జిల్ నుండి జడ్పీటీసీ సభ్యునిగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం ప్రతి తెలంగాణ వాసికి, ముఖ్యంగా మిడ్జిల్ మండల ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కృతజ్ఞత సభకు జడ్చర్ల నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సభ నిర్వహణకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, పోలీసు శాఖకు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.ఇలాంటి ప్రజా ఆదరణ, కార్యకర్తల అంకితభావం కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని, ప్రజాసేవే లక్ష్యంగా పార్టీ నాయకత్వంలో మరింత అభివృద్ధి కోసం కృషి కొనసాగిస్తామని మిడ్జిల్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



