– జాతీయ జెండాలతో విద్యార్థుల ప్రదర్శనలు
– ఆకట్టుకున్న విద్యార్థుల జాతీయ నాయకుల వేషధారణలు
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లిలో త్రివర్ణ పతాక సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ ఎగురవేశారు. ద్వారకాపురిలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పాత సెంటర్లోని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో జండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా వందన వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు మువ్వన్నెల జెండాలు చేతభూని ప్రదర్శన చేశారు. విద్యార్థుల జాతీయ నాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో…
సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఉన్న ఆ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, మోరంపూడి వెంకటేశ్వరరావు, రఫీ, జిలాని, సైదా, మీరాజ్, రామకృష్ణ, నబీ, భాస్కర్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో…
సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గంగారం గ్రామంలో ప్రజాసంఘాల కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాన్ని ఘనంగా జరిపారు. కార్యాలయం ఎదురుగా, ఆంజనేయ ఆలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, అయినంపూడి సునందరావు, కావూరి వెంకటేశ్వరరావు, బండి వేలాద్రి, దేవళ్ల రామారావు, కొలికపోగు రత్తయ్య, ముత్తిని శ్రీను, జయరాజు, వెంకటరమణ పాల్గొన్నారు.
సత్తుపల్లి సింగరేణి ఏరియాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సింగరేణి సత్తుపల్లి ఏరియా పరిధిలోని జేవీఆర్, కిష్టారం ఓసీల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయం వద్ద జీఎం సరికొండ వెంకటాచారి జాతీయ జెండాను ఎురవేశారు. సెక్యూరిటీ సిబ్బంది నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


