Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐదుగురికి బెస్ట్‌ టీచర్‌ అవార్డులు..

ఐదుగురికి బెస్ట్‌ టీచర్‌ అవార్డులు..

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ఆలేరు మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఈ ఏడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై బెస్ట్‌ టీచర్‌ అవార్డులు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఆలేరు మండలానికి చెందిన ఐదుగురికి చోటు దక్కడంతో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. శారాజిపేట మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్  లక్ష్మీకుమారి, టంగుటూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు బూడిద శ్రీనివాస్, కొలనుపాక మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పారెడ్డి  సుచరిత, శారాజిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు టి.శ్రీనివాస్, కొలనుపాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు ఏ.సత్యవతి జిల్లా స్థాయి బెస్ట్‌ టీచర్‌ అవార్డులకు ఎంపికయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు బోధనలో వినూత్న పద్ధతులు, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి. ఒకే మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -