– మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ పిలుపు
నవతెలంగాణ – మద్నూర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా మద్నూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ఎన్నికల నమోదు అధికారి, తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ శుక్రవారం తెలిపారు. సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వద్ద శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన యువత, ఓటరు జాబితాలో పేర్లు లేనివారు, చిరునామా మారినవారు, పేర్లలో తప్పులు ఉన్నవారు ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఆధార్ కార్డు, ఫోటో, చిరునామా రుజువులతో రావాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు.
ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను వినియోగించుకోగలరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



