మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
నవతెలంగాణ-ఆలేరు టౌన్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో మహిళలకి ఇచ్చిన హామీలు అమలు కాలేదని నిరసిస్తూ వాంటావార్పు నిర్వహించారు. నియోజకవర్గస్థాయి మహిళల సమావేశం సునీత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మారుతున్న పరిణామాల దృష్ట్యా మన పిల్లల బాగు కొరకు కుటుంబ పెద్దలు పిల్లలపై దృష్టి సారించాలని అన్నారు. మహిళలను గౌరవంగా కుటుంబ పెద్దగా, సమస్యల పరిష్కారానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పట్ల వివక్ష ఉందన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పై దృష్టి సారించాలని సూచించారు.ఇటీవల 15 కోట్లతో సభ పెట్టి, వదిలేని రుణాల కింద 35 కోట్ల చెక్కించి, సమాఖ్య అధ్యక్షురాలా సమక్షంలో ఇచ్చిన చెక్కు చెక్కుచెల్లలేదు. అంతా గొప్ప సీఎం రేవంత్ రెడ్డి అని ఎదేవా చేశారు. మూడు నెలలుగా మహిళలు చెక్కు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి అలిసిపోయారా అని చెప్పారు. రెండు నెలల క్రితం పేరెంట్ గ్రౌండ్ సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టి మేం పాలపిట్ట రంగు చీరలు ఇచ్చాం అవి కట్టుకోమని చెప్పారని అన్నారు.
అక్కడ 45 కోట్ల చెక్కించి, అక్కడ మహిళలను మోసం చేశాడని ఆ చెక్కుచెల్లలేదని వివరించారు. ఇలా మహిళలను మోసం చేస్తూ వెళ్తున్న ముఖ్యమంత్రి కి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇట్లా మహిళలను మోసం చేస్తూ పోతే ఎవరికి చెప్తారని ,బుద్ధి చెప్పక తప్పదని అన్నారు. ముఖ్యమంత్రిని అడుగడుగున మోసమేనా అని మహిళలకు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ ఉత్సవాలకు నిధులు కేటాయించి మన సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయం పై ఉద్యమిస్తామన్నారు. తిరిగి కెసిఆర్ పాలన కొరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ లు, ఆరే స్వరూప, కాసగళ్ల అనసూయ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మురిగాడి ఇందిరా, ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్లు పాకాల మౌనిక, బీజాన కళ్యాణి , గొల్లగూడెం సర్పంచ్ ఏసి రెడ్డి మంజుల, ఆత్మకూరు సర్పంచ్ బిసు ధనలక్ష్మి, రాఘవపురం సర్పంచ్ పరిదే మమత, వార్డు సభ్యురాలు చిలుకు నిరోష, మాజీ ఎంపీటీసీ యాస కవిత, మాజీ సర్పంచు లావణ్య, బొడ్డు కవిత, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ కరువైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



