Sunday, August 16, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అమెరికా ఒత్తిడికి తలొగ్గుతున్న కేంద్రం

అమెరికా ఒత్తిడికి తలొగ్గుతున్న కేంద్రం

- Advertisement -

ప్రజల సమస్యల పట్ల స్పందించని బీజేపీ
10 టీవీ మాజీ ఎమ్‌డీ ‌వేణుగోపాల్‌
నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీజీఎం ప్రభాకర్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
​అమెరికా ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల సమస్యల పట్ల స్పందించే తత్వం తగ్గించిందని 10 టీవీ మాజీ ఎమ్‌‌డీ ‌కె.వేణుగోపాల్‌ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను చీఫ్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌ పి.ప్రభాకర్‌ ఎగరేశారు. బుక్‌‌హౌస్‌ ఎడిటర్‌ ‌కె.ఆనందచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‌వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. కులం, మతం, భాషలకు అతీతంగా పోరాడి సాధించుకున్నదే ఈ స్వాతంత్యం అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. నాడు రాసుకున్న రాజ్యాంగానికి అనుగుణంగా నేడు పాలన జరగడం లేదన్నారు. నేటికీ విద్య, వైద్యం, ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. రాజ్యాంగంలో కల్పించిన స్వేచ్ఛా హక్కుకు అనుగుణంగా మాట్లాడినా కట్టడి చేసేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నేడు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకుండా పోయిందని, ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఎరువుల రసాయనాలు, ఇథనాల్‌ వంటి సరుకును తమ వద్ద నుంచే కొనుగోలు చేయాలని అమెరికా ఇండియాపై ఒత్తిడి చే‌స్తోం దన్నారు. ఈ నేపథ్యంలో 18 మిలియన్‌ ‌డాలర్ల ఖర్చు పెరిగిందని తెలి పారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జీఎంలు శశికుమార్‌, నరేంద ర్‌‌రెడ్డి, ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు బి.బసవపున్నయ్య, సలీమా, మోహ నకృష్ణ, మేనేజర్లు మహేందర్‌‌రెడ్డి, వీరయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -