Sunday, July 5, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య విరాళాలు..మాజీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలు

అయోధ్య విరాళాలు..మాజీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల చోరీపై మాజీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. తాము అందించిన రూ.5 కోట్ల విలువైన బంగారం తాపడం కలిగిన రామచరిత మానస్ కనిపించడం లేదని, తాను, తన కుటుంబ సభ్యులతో కలిసి 2024 ఏప్రిల్‌లో రామాలయం బాధ్యతలు చూసే శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు తాపడం కలిగిన రామచరిత మానస్‌ను విరాళంగా అందించినట్లు దాత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణన్ చెప్పారు.

తర్వాత ఈ కానుక కొంతకాలం దేవాలయంలో అందరికీ కనిపించేలా ఉంచారు. మరికొంతకాలం తర్వాత నుంచి ఈ రామచరిత మానస్ కనిపించడం లేదని, అక్కడినుంచి తొలగించారని అన్నారు. ఈ అంశంపై తాను ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు. దానికి చంపత్ రాయ్ సమాధానమిస్తూ.. ప్రతి కానుకను అందరికీ కనిపించేలా ఆలయంలో ప్రదర్శించలేమని చెప్పినట్లు లక్ష్మీనారాయణన్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -