తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన నటులు రాజేంద్రప్రసాద్ ఇటీవల అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చిరు సత్కారంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బేల్ ట్రీ హోటల్స్ యజమాని, నటుడు రాజారెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి స్పాన్సర్స్ గా సహకరించారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ గౌరవ అధక్షులు ప్రభు మాట్లాడుతూ,’ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులు, పరిశ్రమతో మమేకమైన ఒక విశిష్టత కలిగిన నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ఏమి చెప్పినా తక్కువే. హాస్యరసాన్ని పండించాలంటే చాలా కష్టం. దానికి ఒక గౌరవ ప్రదమైన స్థానాన్ని తీసుకువచ్చారుఅని తెలిపారు. 'రాజేంద్రస్రసాద్ గురించి చెప్పాలంటే మా ఇంట్లో పెద్దన్న లాంటివారు. ఆయన తెరమీద ఏమేమి చేసేవారో నేను నిజ జీవితంలో అవన్నీ చేసేవాడిని. ఈ సన్మానం ఆయన్ని సన్మానించినట్లు కాదు మన కుటుంబంలో ఒక వ్యక్తిగా సన్మానించినట్లు అని ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు చెప్పారు..
ఫిలిం క్రిటిక్స్ సెక్రటరీ సురేష్‌కొండేటి మాట్లాడుతూ,’ నా జర్నలిజం ఎదుగుదలకు తోడ్పాటుగానే కాకుండా బాపు సినిమాలో నన్ను మొట్ట మొదటిసారి నటుడ్ని చేసింది రాజేంద్రప్రసాద్అని అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 'ఇది కలా నిజమా... నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది. 48 ఏళ్ళ సినీ జీవితంలో ఒక కళాకారుడుగా నేను సినిమాల్లో యాక్ట్ చేసినప్పటి నుంచి నా బిహేవియర్‌లో ఎలాంటి మార్పు లేదు. మన జర్నలిస్టులో ఎవ్వరు ఎప్పుడు ఈ ఫిల్డ్ లోకి వచ్చినా మనమందరం కలిసి, మెలిసి ఉండేవాళ్ళం కలిసే భోజనం చేశాం. కలిసే మాట్లాడుకున్నాం. కలిసే ఉన్నాం. నేను ఒక నటుడ్ని అని నేను ఎప్పుడూ గర్వం చూపించలేదు. ప్రభు.. సురేష్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు. జంధ్యాల లాంటి వారందరూ లేనిదే నేను ఎక్కడ ఉన్నా. అంతమంచి రచయితల వల్లే నేను ఇలా ఉన్నాను. వారు రాసారు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను. పద్మశ్రీరావడం ఆలస్యం అయింది. ప్రతి తెలుగు వారి ఇంట్లోను రాజేంద్రస్రసాద్ ఉన్నారు. నాకు ఇప్పుడు తయారవుతున్న దర్శకులతో కలిపి నేను ఐదు జనరేషన్లు దాటి వచ్చాను. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు, మహేష్‌బాబు, అల్లుఅర్జున్ ఇప్పుడు జనరేషన్ వరకు అందరికి పరిచయం ఉన్నాను అని అన్నారు.
నేను ఎప్పుడూ ఊహించని సత్కారమిది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



