Sunday, July 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలునార్నే నితిన్ నయా సినిమా షురూ..

నార్నే నితిన్ నయా సినిమా షురూ..

- Advertisement -

వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలలో నటించిన హీరో నార్నే నితిన్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం జతకట్టారు. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నార్నే నితిన్ సరసన అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కథా నాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఆదివారం సంప్రదాయ పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత వెంకట్ కె నారాయణ క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరాను ఆన్ చేశారు. ‘మ్యాడ్` దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించగా, వెంకట్ కె నారాయణ స్క్రిప్ట్‌ను దర్శకుడు రాధాకృష్ణకు అందజేశారు. రొమాన్స్, కామెడీ, మనసుని హత్తుకునే భావోద్వేగాల కలయికతో బలమైన ఎమోషనల్ అంశాలతో కూడిన కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది అని మేకర్స్ తెలిపారు. నార్నే నితిన్, అనిఖా సురేంద్రన్, మేఘా శెట్టి నాయకానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి నిర్మాత: వెంకట్ కె నారాయణ, రచన, దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: లోహిత ఎన్కె, సంగీతం: వివేక్ – మెర్విన్, డీఓపీ : రామ మారుతి ఎం., ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ఆర్ట్ డైరెక్టర్: శివ కామేష్ డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్య పోట్ల, అజయ్ గద్దె, కాస్ట్యూమ్ డిజైనర్: దిలేషా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -