Tuesday, July 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయెమన్ తీరంలోకార్గో నౌకపై దాడి

యెమన్ తీరంలోకార్గో నౌకపై దాడి

- Advertisement -


సనా : యెమన్‌కు చెందిన ఎర్ర సముద్రం తీరంలో కార్గో నౌకపై గుర్తు తెలియని సాయుధులు దాడి చేశారని బ్రిటన్ మారీటైమ్ వాణిజ్య సంస్థ (యూకేఎంటీఓ) ఆదివారం తెలిపింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. యెమన్‌లోని ఓడరేవు పట్టణమైన హ=దైదహ్‌కు నైరుతి దిశగా 30 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న నౌక నుంచి తమకు దాడికి సంబంధించిన సమాచారం అందిందని యూకేఎంటీఓ చెప్పింది. దాడికి తామే కారణమని ఏ సంస్థ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఎర్ర సముద్రం కారిడార్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ కారిడార్‌లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు గత కొన్ని నెలలుగా భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతం బాబ్ అల్`మందబ్ జలసంధి సమీపంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ అడెన్‌ను ఈ జలమార్గం అనుసంధానిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -