18 మంది మృతి….60 మందికి గాయాలుకైవ్ : రష్యా సేనలు సోమవారం ఉదయం ఉక్రెయిన్‌పై దాడులు జరిపాయి. క్షిపణులు, డ్రోన్లతో జరిగిన ఈ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. రష్యా దాడిలో రెండు బహుళ అంతస్థుల భవనాలు దెబ్బతిన్నాయి. శిధిలాల కింద చిక్కుబడిపోయిన వారి కోసం సహాయ సిబ్బంది గాలింపు జరుపుతున్నారు. రాజధాని కైవ్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా ఆదివారం రాత్రి వందలాది డ్రోన్లను, డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. రష్యా నుంచి దూసుకొచ్చిన 29 బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాలను తాకాయి. పాట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల కొరత కారణంగా ఉక్రెయిన్‌లోని లక్ష్యాలను రష్యా క్షిపణులు, డ్రోన్లు తేలికగా చేరుకోగలుగుతున్నాయి. క్షిపణులను అడ్డుకునే వ్యవస్థల కొరత తీవ్రంగా ఉన్నదని వైమానిక దళ ప్రతినిధి యురీ ఇనత్ చెప్పారు. కాగా తమకు గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మిత్ర దేశాలను కోరారు. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను తమ దళాలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోలేకపోతున్నాయని ఆయన తెలిపారు.
నాటో సదస్సుకు టర్కీ సిద్ధమవుతున్న సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగడం గమనార్హం. సదస్సు సందర్భంగా జెలెస్‌స్కీ సహా పలువురు నేతలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అవుతారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



