నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనకు గల పూర్తి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- Advertisement -
- Advertisement -



