Monday, July 6, 2026
E-PAPER
Homeజాతీయంతిరుమల కొండ ఎక్కిన116 ఏళ్ల వృద్దురాలు..మాట నిలబెట్టుకున్న టీటీడీ

తిరుమల కొండ ఎక్కిన116 ఏళ్ల వృద్దురాలు..మాట నిలబెట్టుకున్న టీటీడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టిటిడి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించింది. ఛైర్మన్‌ బీ ఆర్‌ నాయుడు చొరవతో వృద్ధురాలి కుటుంబానికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వృద్ధురాలిని దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వృద్ధురాలు శనివారం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరలైంది. దీనిపై స్పందించిన టిటిడి ఛైర్మన్‌ వృద్ధురాలి వివరాలు తెలిస్తే తన కార్యాలయాన్ని నేరుగా సంప్రదించాలని.. ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఎక్స్‌ ప్రకటించారు.టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది ఆమె వివరాలను సేకరించారు. తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చెప్పినట్లుగానే ఇవాళ‌ ఉదయం నవనీతమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -