- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో రూ.16,007 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి హన్మకొండ జిల్లా పరకాలకు చేరుకొని ప్రజా సభలో పాల్గొననున్నారు.
- Advertisement -



