- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై-పుణే ఘాట్ సెక్షన్‌లో రైల్వే ట్రాక్‌లపై కొండచరియలు, బండరాళ్లు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనతో ఈ కీలక మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
- Advertisement -



