నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి మోడీ సోమవారం నుంచి ఆరు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు, ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోడీ జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు పీఎం మోడీ వెళ్లనున్నారు. ఈ పర్యటన భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసముద్రాల దృష్టికోణం, అలాగే స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ లక్ష్యాలను మరింత బలోపేతం చేయనుంది ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
ఆరు రోజుల పాటు మూడు దేశాల్లో పీఎం మోడీ పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



