Monday, July 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలి: ఎంఈఓ

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలి: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలో ఆయా గ్రామల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అందించే అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందని మండల విద్యాధికారి విజయ్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన కుభీర్ లోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, చోండి, గోడిసారా, పాంగ్ర,ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింతగా పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదే విదంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం తో పాటు అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యత తో కూడిన  భోజనాన్ని అందించేలా చూడలని అన్నారు. ఆయన వెంట ఆశ్రమ పాఠశాల ప్రాథనోపాధ్యాయులు మురళి ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -