నవతెలంగాణ-కుభీర్
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల్లో తమ ప్రతిభ మరింత కనబరచాలనీ విశ్వబ్రాహ్మణ సంఘ మండలాధ్యక్షడు మండాజీ లింబాద్రీ, మాజీ ఎంపీపీ తుమ్ రాజేశ్వర్ లు అన్నారు. మండల పరిధిలోని పార్టీ బీ గ్రామానికి చెందిన కండెల సునీల్-కావ్య కూతురు శివానీ ఎంబీబీఎస్ స్టేట్ 555 ర్యాంకు సాధించారు. ఈ క్రమంలో సోమవారం గ్రామస్తులు శివానీని అభినందించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థిని శివానీ ఎంబీబీస్ సీటు సాధించడం మా గ్రామానికే గర్వకారణమన్నారు. శివానీని ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత పట్టుదలతో చదివి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ వైద్యసేవలు అందించాలనీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ తుమ్ రాజేశ్వర్, మాజీ సర్పంచ్ రాజన్న సంఘ అధ్యక్షుడు లింబాద్రి, గ్రామస్తులు చిమ్మన్ పోశెట్టి, శేరి సురేష్,గుడాల రాజలింగు, లక్ష్మణ్,గణేష్, కానోబా,గాందరి సాయినాథ్,కుల సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత చదువుల్లో గ్రామీణ ప్రాంత యువత రాణించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



