Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి విత్తనాల పంపిణీలో గందరగోళం.. ఏఈఓలతో రైతుల వాగ్వాదం

పత్తి విత్తనాల పంపిణీలో గందరగోళం.. ఏఈఓలతో రైతుల వాగ్వాదం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (కపాస్ కాంతి) కార్యక్రమంలో భాగంగా పత్తి రైతులకు హెచ్‌డీపీఎస్, ఐసీఎం విత్తనాల పంపిణీలో సోమవారం గందరగోళం నెలకొంది. ఉప్పునుంతల మండలంలోని పిరట్వానిపల్లి గ్రామ రైతు వేదికలో విత్తనాల పంపిణీ జరుగుతుండగా, అర్హులైన రైతులకు విత్తనాలు అందడం లేదని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు)తో వాగ్వాదానికి దిగారు.

వ్యవసాయం చేయని కొందరికి విత్తనాలు కేటాయించి, వారు వాటిని బయట విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. నిజమైన సాగుదారులను పక్కనపెట్టి పంపిణీ చేయడం వల్ల అర్హులైన రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా, అర్హుల జాబితా ఆధారంగా విత్తనాలు పంపిణీ చేసి ప్రతి నిజమైన రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు. అధికారులు పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -