నవతెలంగాణ-ఆర్మూర్
ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ విధిగా యూనిఫాం, బ్యాడ్జ్ ధరించి ఆటో నడుపుతూ ఇతర ఆటో డ్రైవర్లకు ఆదర్శంగా నిలుస్తున్న ఆటో డ్రైవర్ సయ్యద్ మొయిన్ ని సోమవారం పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ రఘుపతి మాట్లాడుతూ.. యూనిఫాం మరియు బ్యాడ్జ్ ధరించడం వల్ల ప్రయాణికుల్లో విశ్వాసం పెరగడంతో పాటు ఆటో డ్రైవర్ల వృత్తి గౌరవం కూడా పెరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న శ్రీ సయ్యద్ మొయిన్ ను అభినందించి, ఆయనను ఆదర్శంగా తీసుకుని మిగిలిన ఆటో డ్రైవర్లు కూడా తప్పనిసరిగా యూనిఫాం, బ్యాడ్జ్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రజలకు సురక్షితమైన, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ ను సన్మానించిన ట్రాఫిక్ పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



