Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇకనుండి ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ సమావేశ భవాన్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఎమ్మార్వో మారుతి, మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -