Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా తహశీల్దార్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా తహశీల్దార్‌ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ ఎండీ ముజీబ్‌ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్‌ఐ, జూనియర్‌ అసిస్టెంట్లు, జీపీఓలు, కార్యాలయ సిబ్బంది తహశీల్దార్‌ కు స్వీట్లు తినిపించి, శుభాకాంక్ష‍లు తెలిపారు. అదేవిధంగా మండల పరిధిలోని సర్పంచులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముజీబ్‌ ను సన్మానించి, నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్ష‍ించారు. కార్యక్రమంలో మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, పెద్ద ఎక్లార గ్రామ సర్పంచ్ మహేష్, కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -