రెండు మండలాల్లో 12 ఫిర్యాదులు
నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17 నుండి ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజే మద్నూర్ డోంగ్లి మండలాల్లో విశేష స్పందన లభించింది. మద్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సాయిలు అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 10 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా డోంగ్లి మండల కేంద్రంలో ఎంపీడీవో జగదీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 12 మంది అధికారులు హాజరయ్యారనీ, కాగా రెండు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. డోంగ్లి మండల కేంద్రంలో జరిగిన ఆ మండల తాసిల్దార్ రంజిత్ కుమార్ పాల్గొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలు, ఎంపీఓ సత్యనారాయణరెడ్డి, తాసిల్దార్ ఎండి ముజీబ్, ఎంఈఓ రాములు, ఏవో రాజు, వివిధ శాఖలకు చెందిన 15 మంది వరకు అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం చేసేందుకు మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు అన్ని శాఖల అధికారులతో చేపట్టడం సమస్యల పరిష్కారానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇరు మండలాల్లో కలిసి 12 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.



