Tuesday, July 7, 2026
E-PAPER
Homeజాతీయంకేరళంలో మూతబడిన కోరో హెల్త్‌ కంపెనీ

కేరళంలో మూతబడిన కోరో హెల్త్‌ కంపెనీ

- Advertisement -


ఉపాధి కోల్పోయిన 800మంది ఉద్యోగులు
కొజికోడ్‌ :
అమెరికాకు చెందిన ఆరోగ్య సంరక్షణ సంస్థ కోరో హెల్త్‌ ఇన్ఫోటెక్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌‌ కేరళంలో తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణ యించడంతో సోమవారం కోచి, కొజికోడ్‌ల్లోని కంపెనీ కార్యాలయాల్లోకి రాకుండా వర్కర్లను అడ్డుకున్నారు. కంపెనీ నిర్ణయంతో ఎలాంటి ముందస్తు నోటీసుల్లే కుండా దాదాపు 800మంది ఉద్యోగులు తొలగింపును ఎదుర్కొంటున్నారు. కంపెనీ చర్యలతో చట్టపరమైన నిబంధనల పాటింపునకు సంబంధించి వివాదం తలె త్తింది. కాగా కంపెనీ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోచి కార్యాలయం వద్ద డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి, మట్టనూర్‌ ఎంఎల్‌ఎ వి.కె.సనోజ్‌, సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. కోజికోడ్‌‌లో డివైఎఫ్‌ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు, బేపోర్‌ ‌సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ పి.డీ మహ్మద్‌ ‌రియాజ్‌ కంపెనీ కార్యాలయానికి ‌వచ్చి అక్కడ నిరసన తెలుపుతున్న కార్మికులతో మాట్లాడి వారికి సంఘీభావం తెలిపారు. వారి జోక్యంతో భద్రతా సిబ్బంది ఆఫీసు గేట్లను తెరిచారు. ఉద్యోగులను కంపెనీ ఆవరణలోకి అనుమతించారు. ‘ఉదయం 8గంటల నుండి ఉద్యోగులు ఇక్కడ వేచి వున్నారు. కార్మిక చట్టాల ప్రకారం అనుసరించాల్సిన ఎలాంటి పద్దతులు, ప్రక్రియ లేకుండానే యాజమాన్యం వారిని తొలగించింది. వారి కార్యాలయాలను ఖాళీ చేయించింది.’ అని సనోజ్‌ ‌పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -