Tuesday, July 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమణిపూర్‌లో ఉగ్ర దాడి..ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్ర దాడి..ఇద్దరు జవాన్లు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అస్సాం జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఐఈడీ బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మణిపూర్ సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఈ దాడిని ఖండించి, బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -