Tuesday, July 7, 2026
E-PAPER
Homeబీజినెస్కొత్త ఎంజి ప్రో వి, ఎంజి ప్రో+ ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్‌ను ప్రకటించిన కొమాకి

కొత్త ఎంజి ప్రో వి, ఎంజి ప్రో+ ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్‌ను ప్రకటించిన కొమాకి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ అయిన కొమాకి, తన కొత్త ఎంజి ప్రో వి మరియు ఎంజి ప్రో+ ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్‌ను ప్రకటించింది. వీటి ద్వారా ప్రీమియం ఇంజినీరింగ్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వరుసగా రూ.73,999 మరియు రూ.79,999 ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త మోడళ్లు పూర్తి-మెటల్ బాడీతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఈ ధరలో ఈ ఫీచర్ చాలా అరుదుగా లభిస్తుంది.

తమ బడ్జెట్‌ పెంచుకోకుండా మెరుగైన మన్నిక కోరుకునే రైడర్ల కోసం రూపొందించిన ఎంజి ప్రో వి మరియు ఎంజి ప్రో+ స్కూటర్లు దృఢమైన నిర్మాణాన్ని, ఆచరణాత్మకమైన రోజువారీ పనితీరును కలిపి అందిస్తాయి. ఈ విభాగంలోని చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫైబర్ బాడీ ప్యానెళ్లపైనే ఆధారపడగా, కొమాకి మెటల్ బాడీతో కూడిన ప్రత్యామ్నాయాన్ని పరిచయం చేసింది. ఇది అధిక బలం, మెరుగైన మన్నిక, భరోసా ఇచ్చే దృఢమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఎంజి ప్రో వి ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 90-100 కి.మీ.ల రేంజ్‌ అందిస్తుంది, ఎంజి ప్రో+ అయితే ఈ రేంజ్‌ను 150+ కి.మీ.లకు పెంచుతుంది. అందువల్ల ఈ రెండు మోడళ్లు రోజువారీ ప్రయాణాలకు, నగరంలో తిరగడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. బిఎల్‌డిసి హబ్ మోటార్, అధునాతన ఎల్‌ఐపిఒ4 బ్యాటరీ టెక్నాలజీతో పనిచేసే ఈ స్కూటర్లును తక్కువ నిర్వహణ అవసరాలతో నమ్మకమైన పనితీరును అందించేలా రూపొందించారు.

మెటల్ నిర్మాణంతో పాటుగా ఈ రెండు స్కూటర్లు సౌకర్యం, భద్రతను పెంచే ఫీచర్లతో వచ్చాయి. వీటిలో బ్యాటరీ ఆరోగ్యం, పరిధి పర్యవేక్షణ కోసం మొబైల్ యాప్ అనుసంధానత, ముందు డిస్క్ బ్రేకులు, టెలిస్కోపిక్ సస్పెన్షన్, యాంటీ-థెఫ్ట్ లాక్, పార్కింగ్ అసిస్ట్, రిపేర్ స్విచ్, మరియు విశాలమైన రైడింగ్ ప్లాట్‌ఫామ్ వంటివి ఉన్నాయి. ఎంజి ప్రో+ ఇంకా పెద్ద బూట్ స్పేస్‌ను అందిస్తుంది, ఇది రోజువారీ రైడర్ల ఆచరణాత్మక అవసరాలను తీరుస్తుంది.

ఈ లాంచ్ సందర్భంగా కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సహ-వ్యవస్థాపకురాలు గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, “ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది, కానీ అందుబాటు ధర అనేది నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. సాంప్రదాయకంగా ఖరీదైన వాహనాల్లోనే ఉన్న ఫీచర్లను ఎంజి ప్రో వి మరియు ఎంజి ప్రో+ లతో సామాన్య వినియోగదారులకు కూడా అందించాలని మేము కోరుకున్నాము. వీటిలో దృఢమైన మెటల్ బాడీ, సురక్షితమైన, ఎక్కువ కాలం మన్నే ఎల్‌ఐఎఫ్‌ఇపిఒ4 బ్యాటరీలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు, ఐసిఇ వాహనాలలో ఉన్న బ్యాటరీల కంటే వీటికే ఎక్కువ జీవితకాలం ఉంటుంది. ఈ కలయిక వినియోగదారులలో విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రీమియం నిర్మాణ నాణ్యత, నమ్మకమైన పనితీరు, ఆధునిక సాంకేతికతను మరింత విస్తృత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను కూడా ఇది ప్రతిబింబిస్తుంది. కేవలం చూడటానికి బాగుండేవే కాకుండా, రోజువారీ భారతీయ రహదారి పరిస్థితులను తట్టుకునేలా నిర్మించబడిన ఉత్పత్తులకు వినియోగదారులు అర్హులని మేము నమ్ముతున్నాము.”

ఎంజి ప్రో వి మరియు ఎంజి ప్రో+ పరిచయంతో మన్నిక, సాంకేతికత, విలువను మిళితం చేసే ఉత్పత్తులను అందించడం ద్వారా కొమాకి తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూనే ఉంది. మెటల్ బాడీ ఎలక్ట్రిక్ స్కూటర్లను అత్యంత పోటీ ధరలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఈ కంపెనీ భారతీయ వినియోగదారుల మారుతున్న అంచనాలను అందుకుంటూ, సరసమైన ఈవీ విభాగంలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -