సీఎం సూచనకు అధిష్టానం ఓకే
నేడు సింఘ్వీతో కలిసి నామినేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ సీటు ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగల్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకదానికి బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కే.సురేశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మరోదానికి అభిషేక్ సింఘ్వీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం రీత్యా ఈ రెండూ కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి.
కాగా సింఘ్వీని తెలంగాణ నుంచే మరోసారి పెద్దల సభకు పంపాలని నిర్ణయించిన ఏఐసీసీ పెద్దలు, ఆ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు సమాచారమిచ్చారు. ఇక రెండో స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి… వేం నరేందర్‌రెడ్డికి ఇప్పించుకోవటంలో సఫలీకృతులయ్యారు. తాను టీడీపీలో ఉన్నప్పటి నుంచి సన్నిహితుడుగా ఉంటూ, అన్ని సమయాల్లో సైతం చేదోడు వాదోడుగా ఉన్న వేం నరేందర్‌రెడ్డికి ఆ సీటును ఇప్పించుకున్నారు. ఆయనతోపాటు సింఘ్వీ గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
రాజ్యసభకు వేం నరేందర్‌రెడ్డి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



