- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు. వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగలడంతో స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -



