- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్‌లోని సూరత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వరద ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కామ్రేజ్‌లో 403 మి.మీ, పల్సానాలో 357 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక మరో 72 గంటలు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Advertisement -



