Wednesday, July 8, 2026
E-PAPER
Homeజాతీయంనడిరోడ్డుపై ఓ నాగుపాము హల్ చల్..వీడియో

నడిరోడ్డుపై ఓ నాగుపాము హల్ చల్..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక రాజధాని బెంగళూరులో నడిరోడ్డుపై ఓ నాగుపాము హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డు మీదకు ఒక నాగుపాము వచ్చింది. పడగ విప్పిన అది రోడ్డు మధ్యలో ఉన్నది. సుమారు 40 నిమిషాల వరకు ఆ పాము కదకుండా అక్కడే ఉన్నది. ఈ నేపథ్యంలో వాహనాలు ఆగిపోవడంతో అక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది.కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎంతకీ కదలక రోడ్డు మధ్యలో తిష్ట వేసిన ఆ నాగుపామును చివరకు సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. పాము కారణంగా స్తంభించిన ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -