నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఎస్ఐఆర్ లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలపై అందరికీ అవగాహన ఉండాలనే ఉద్ద్యేశంతో రేషన్ డీలర్లకి, ఆలేరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద శిక్షణా తరగతులు నిర్వహించారు. తాహసిల్దార్ వి.ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారం నింపడంలో రేషన్ డీలర్లు ప్రజలను ప్రతిరోజు కలుస్తూ ఉంటారని, ఈ ఎన్యుమరేషన్ ఫారం నింపడం పై వారికి కూడా అవగాహన ఉన్నట్టయితే వారి ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫారాలను కూడా ఏ తప్పులు జరగకుండా పూరించే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆయా గ్రామాలలోని ఓటర్లకు ఎలాంటి అనుమానాలున్న, వీరు కూడా ఓటర్లకు అవగాహన కల్పిస్తారని అన్నారు.
ఈ ఫారాలు నింపడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బిఎల్వీఓ లను సంప్రదించాలని ఆయన కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ బిజన బాలమని భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, ఎన్నికల శిక్షణ అధికారి దూడల వెంకటేష్, డిప్యూటీ తాసిల్దార్ రామదాసు నాయక్, వార్డు కౌన్సిలర్లు మాట్లాడారు.



