Thursday, July 9, 2026
E-PAPER
Homeబీజినెస్గ్లోబల్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ‘వన్‌సర్కిల్’ను ప్రారంభించిన మేక్‌మైట్రిప్

గ్లోబల్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ‘వన్‌సర్కిల్’ను ప్రారంభించిన మేక్‌మైట్రిప్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మేక్‌మైట్రిప్, భారతీయ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన గ్లోబల్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ‘వన్‌సర్కిల్’ను ఈ రోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1,002 నగరాల్లో విస్తరించి ఉన్న హోటల్స్  అండ్ ఆల్టర్నేట్ అకామోడేషన్స్ సహా మొత్తం 13,376 వసతి ప్రాపర్టీల (జూన్ 30, 2026 నాటికి) భాగస్వామ్య నెట్‌వర్క్‌ను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.

వన్‌సర్కిల్ కార్యక్రమం భారతదేశంలోని 868 నగరాలను కవర్ చేస్తూ, ‘అండర్ వన్ రివార్డ్స్ ప్రోగ్రామ్’లో భాగంగా 12,330కు పైగా వసతి ప్రాపర్టీలతో ప్రారంభమైంది. అంతర్జాతీయంగా, ఈ కార్యక్రమం 39 దేశాల్లోని 134 గమ్యస్థానాల్లో ఉన్న 1,046 ప్రాపర్టీలకు విస్తరించింది. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికుల అభిరుచులు, ప్రయాణ ధోరణులను దృష్టిలో ఉంచుకుని ఈ గమ్యస్థానాలను ఎంపిక చేశారు. ప్రాపర్టీల ఎంపికలో వినియోగదారుల రేటింగ్‌లు, మేక్‌మైట్రిప్ సప్లై టీమ్ నిర్వహించిన ఆన్-గ్రౌండ్ అసెస్మెంట్, అలాగే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఆయా ప్రాపర్టీల ఆసక్తిని ప్రధాన ప్రమాణాలుగా పరిగణించారు.

వన్‌సర్కిల్ కార్యక్రమం లగ్జరీ, ప్రీమియం, బడ్జెట్ విభాగాల్లోని స్వతంత్ర హోటళ్లతో పాటు హోమ్‌స్టేలు, విల్లాలు వంటి విభిన్న వసతి భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. దీంతో ప్రయాణికులు తమ అభిరుచులు, బడ్జెట్‌కు అనుగుణంగా విభిన్న రకాల వసతి ఎంపికలను సులభంగా ఎంచుకునే అవకాశం పొందుతారు. ఈ నెట్‌వర్క్‌లో బుకింగ్ చేసుకునే ప్రతి ప్రయాణికుడు తన వసతి ఖర్చులో కనీసం 10 శాతాన్ని రివార్డ్ పాయింట్ల రూపంలో తిరిగి పొందవచ్చు. సంపాదించిన ఈ పాయింట్లను వన్‌సర్కిల్ నెట్‌వర్క్‌లోని ఏ భాగస్వామి ప్రాపర్టీలోనైనా తదుపరి వసతి కోసం వినియోగించుకోవచ్చు.

ఈ కార్యక్రమం భారతదేశ దేశీయ ప్రయాణ వృద్ధిని నడిపించే నాన్-మెట్రో మార్కెట్స్ వైపు దృష్టి సారించింది:  ఇందులో భాగమైన ప్రతి నాలుగు ప్రాపర్టీల్లో మూడింటి వరకు టైర్-2, టైర్-3 సిటీస్ లోనే ఉన్నాయి. ప్రాపర్టీల సంఖ్య పరంగా గురుగ్రామ్, బెంగళూరు, జైపూర్ అగ్రస్థానాల్లో నిలవగా, రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ ముందంజలో ఉన్నాయి. మెట్రో నగరాలు, వ్యాపార కేంద్రాల నుంచి హిల్ స్టేషన్లు, బీచ్‌లు, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు, ప్రత్యేక ఆకర్షణ కలిగిన గమ్యస్థానాల వరకు విస్తరించిన ఈ కార్యక్రమం, బడ్జెట్ వసతి నుంచి విలాసవంతమైన హోటళ్ల వరకు అన్ని ధరల శ్రేణిలో ఎంపికలను అందిస్తోంది.

మిస్టర్ రాజేష్ మాగోవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు గ్రూప్ సిఇఒ, మేక్‌మైట్రిప్ మాట్లాడుతూ, “వన్‌సర్కిల్ ఒక సరళమైన ఆలోచనతో రూపుదిద్దుకుంది. ప్రతి ప్రయాణం ప్రయాణికునికి మరింత విలువను అందించాలి. అలాగే ప్రతి అకామోడేషన్  పార్ట్‌నర్‌కు దీర్ఘకాలిక వ్యాపార వృద్ధికి దోహదపడే అవకాశాన్ని కల్పించాలి. ప్రయాణికుల పరంగా చూస్తే, దేశీయమైనా, అంతర్జాతీయమైనా ప్రతి వసతిపై నిజమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఇది కల్పిస్తుంది. మా భాగస్వాముల కోసం, కొత్త డిమాండ్‌ను సృష్టించడంతో పాటు, మళ్లీ వచ్చే అతిథులతో దీర్ఘకాలిక సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది.”

దశలవారీగా ప్రారంభించినప్పటి నుంచి వన్‌సర్కిల్ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి ప్రోత్సాహకరమైన స్పందన లభిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -