Friday, July 10, 2026
E-PAPER
Homeజాతీయంపుట్ పాత్ ఆక్రమణలపై కర్నాటక సర్కార్ ఉక్కుపాదం

పుట్ పాత్ ఆక్రమణలపై కర్నాటక సర్కార్ ఉక్కుపాదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మెట్రో పాలిటన్ సిటీలో భారీ యోత్తున పుట్ పాత్ లు ఆక్రమణకు గురువుతున్న విషయం తెలిసిందే. పాదాచారాలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేలా కొందరు పుట్ పాత్ లపై అనేక షాప్ లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అనుమతులు లేకుండా పుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన అనేక షాప్ లను తొలగించేందుకు కర్నాటక ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బెంగుళూర్ వ్యాప్తంగా శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి భారీ యోత్తున సదురు దుకాణాలను తొలిగిస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ పరివేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశుభ్రంగా, సురక్షితంగా, బెంగళూరు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాదచారుల భద్రతను మెరుగుపరచడంతో పాటు పేద వీధి వ్యాపారులకు పునరావాసం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. బెంగళూరుకు పెరుగుతున్న ప్రపంచ స్థాయి ప్రాముఖ్యతకు మెరుగైన పౌర మౌలిక సదుపాయాలు, సురక్షితమైన ప్రజా ప్రదేశాలు అవసరమన్నారు. భారతదేశం, ప్రపంచం.. బెంగళూరు వైపు చూస్తున్నాయి, ఇది అత్యంత సురక్షితమైన నగరాలలో ఒకటిగా ఉండాలని తాము కోరుకుంటున్నాము. గత మూడేళ్లలో, ఈ సమస్యల కారణంగా 900 మందికి పైగా పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు.

పాదచారుల కోసం ప్రభుత్వం భారీ ఎత్తున పనులు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు 135 కిలోమీటర్లకు పైగా ఫుట్‌పాత్‌లపై పనులు పూర్తయ్యాయి. వేలాది దుకాణాలను తొలగించారు. దాదాపు 50,000 ఆక్రమణలను తీసివేశారు. వీటిలో దుకాణాలు, ర్యాంపులు, ఇతర అనధికార నిర్మాణాలు ఉన్నాయని సీఎం డీకే శివకుమార్ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -