Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డోంగ్లీ కాంగ్రెస్ మండలాధ్యక్షులు గజానంద్ దేశాయ్ అన్నారు. రైతు భరోసా నిధులు సకాలంలో వ్యవసాయదారులు ఖాతాలలో జమచేసిన సందర్భంగా డోంగ్లి మండల కేంద్రంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలకడగా లేకున్నా రైతులకు సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేసి రేవంత్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బాచవార్ లక్ష్మణ్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ ప్రముఖులు, వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -