Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంది పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు

కంది పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణమద్నూర్ 
మండల పరిధిలోని మేనూర్ రైతు వేదికలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్, వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో అధికారులు 125 మంది రైతులకు WRGe97 విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కందిలో రైసోబియం, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు వంటి మేలైన మేలుకువలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రుద్రూర్ సీనియర్ సైంటిస్ట్ హెడ్ డాక్టర్ కె. ఇందుధర్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి వి. రాజు, విస్తరణాధికారి విశాల్, గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ ,  గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -