Saturday, March 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ధురంధ‌ర్-2 ముంద‌స్తు బుకింగ్స్ షూరు

ధురంధ‌ర్-2 ముంద‌స్తు బుకింగ్స్ షూరు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గూడచార్యం నేప‌థ్యంలో సాగిన ధురంధ‌ర్ మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. దీనికి సింక్వెల్ గా ధురంధ‌ర్-2 ఈనెల 19న విడుద‌ల కాబోతుంది.దీంతో మూవీ మేక‌ర్స్ ముంద‌స్తుగానే టికెట్ల‌ బుకింగ్స్‌ను ప్రారంభించారు.ఈ సీక్వెల్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. సుమారు 3 గంటల 40 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్‌తో వస్తున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో, రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పోటీగా రావాల్సిన యష్ ‘టాక్సిక్’ సినిమా జూన్ నెల‌కు వాయిదా పడటంతో, ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సోలోగా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -