Saturday, July 11, 2026
E-PAPER
Homeజాతీయంసుప్రీం కోర్టులో కలకలం

సుప్రీం కోర్టులో కలకలం

- Advertisement -

ధర్మాసనంపైకి
పేపర్లు విసిరిన పిటిషనర్‌

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో కలకలం చెలరేగింది. ఒక కేసు విచారణ సందర్భంగా పిటి షనర్‌, న్యాయవాది దురుసుగా ప్రవర్తించ డంతో పాటు, కేసుకు సంబం ధించిన పేపర్లను ధర్మాసనం వైపు విసిరేయ డంతో అంతా షాక్ కు గురయ్యారు. దీంతో కోర్టులో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకొనివెళ్లారు. జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్, జస్టిస్‌ అలోక్ అరధేలతో కూడిన ‌ధర్మాసనం ముందు ఈ ఘటన జరిగింది. అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్‌‌ను ధర్మాసనం విచారిస్తోంది. పిటిషనర్‌, న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ లక్నోకు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలని న్యాయమూర్తులను ఆదేశిస్తున్నట్లు మాట్లాడారు. దీనికి జస్టిస్‌ ‌విశ్వనాథన్‌ ‌స్పందిస్తూ ‘మీరు మాకు ఆదేశాలు ఇస్తున్నారా’? అని ప్రశ్నించారు. దీనికి ఆ వ్యక్తి మరింతగా రెచ్చిపోయి తాను సార్వభౌమాధికారిని అని అర్థం వచ్చేటట్టు మాట్లాడాను. ‘నా వైపు చెపాల్సింది ఇంతే. అన్నీ రికార్డుల్లో ఉన్నాయి’ అని అంటూ తన చేతిలో పేపర్లును ధర్మాసనం వైపు విసిరివేశారు. భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనంపై ఒక న్యాయవాది ‘షూ’ విసిరిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. 2009లో అప్పటి జస్టిస్ అరిజిత్ పసాయత్‌‌పై ఒక ధిక్కార కేసు విచారణ సందర్భంగా ఒక మహిళ చెప్పును విసిరారు. న్యాయమూర్తికి ఆ చెప్పు తగలలేదు. ఇక, 1968 మార్చిలో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనంపైకే ఒక వ్యక్తి ఏకంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో జస్టిస్ ఎఎన్ గ్రోవర్‌కు తల వెనుక భాగంలో దెబ్బ తగలడంతో కిందపడిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -