Saturday, July 11, 2026
E-PAPER
Homeసినిమాశ్రీ శ్రీ'గా దుల్కర్ సల్మాన్

శ్రీ శ్రీ’గా దుల్కర్ సల్మాన్

- Advertisement -

హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను అందంగా మేళవించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్‌ ఈ జంట మధ్య ఉన్న ఆకట్టుకునే కెమిస్ట్రీ ప్రజెంట్ చేశాయి. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ.. చిత్ర నిర్మాతలు ఇప్పుడు సినిమా టైటిల్‌తో పాటు, ప్లజెంట్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఈ సినిమాకు ‘శ్రీ శ్రీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి “లవ్ విల్ స్పార్క్ అగైన్” అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్ ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరూ ఒక కాంపౌండ్ గోడపై కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. పాస్టెల్ బ్లూ షర్ట్, గ్రే ట్రౌజర్, కళ్లద్దాలతో కనిపిస్తున్న దుల్కర్ సిగ్గరించిన చిరునవ్వుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తే, లైట్ బ్లూ సల్వార్ సూట్‌లో ఉన్న పూజా హెగ్డే అతని వైపు చూసి మనసారా నవ్వుతూ కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ పోస్టర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కొత్తదనాన్ని, పాజిటివ్ వైబ్స్‌ను పంచుతూ, దుల్కర్ సల్మాన్-పూజా హెగ్డే జోడీతో ప్రేక్షకులకు మనసును హత్తుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నామని హామీ ఇస్తోంది.
అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -